Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్యాంగ్ రేప్‌తో నాకు సంబంధం లేదు: తెలంగాణ హోం మంత్రి మ‌న‌వ‌డు పుర్ఖాన్‌

telengana home minister grand son clarity on gang rape
  • ఆరోప‌ణ‌లు చేసిన వారు నిజాలు తెలుసుకోవాలన్న ఫుర్ఖాన్  
  • ఆరోజు మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లో ఉన్నానని వెల్లడి 
  • తాను ఎవ‌రికీ పార్టీ ఇవ్వ‌లేదని స్పష్టీకరణ 
  • వాళ్లు ఎవ‌రో కూడా తనకు తెలియ‌దన్న పుర్ఖాన్‌
హైద‌రాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌లో కీల‌క నిందితుడు తెలంగాణ హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ మ‌న‌వ‌డు పుర్ఖాన్ అని వినిపిస్తున్న వార్త‌ల‌పై ఆయ‌న తాజాగా స్పందించారు. త‌న‌కు ఆ గ్యాంగ్ రేప్‌తో ఎలాంటి సంబంధం లేద‌ని శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ప్ర‌క‌టించారు. 

గ్యాంగ్ రేప్ జ‌రిగిన‌ట్లుగా భావిస్తున్న రోజున తాను మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో ఉన్నాన‌ని పుర్ఖాన్ తెలిపారు. తాను ఆ రోజు ఎవ‌రికీ పార్టీ ఇవ్వ‌లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు. పార్టీలో పాల్గొన్న వారు, గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ వారు ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని సూచించారు.
Hyderabad
Jubilee Hills
Telangana
Gang Rape

More Telugu News